ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఓజీ’ మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్‌లో 3 మిలియన్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఓవర్సీస్‌లో దీని కలెక్షన్లపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నార్త్ అమెరికాలో ‘ఓజీ’ ప్రీమియర్స్‌లోనే ₹26 కోట్లకు పైగా వసూలు చేసిందని చిత్రయూనిట్ తెలిపింది. ప్రీమియర్స్‌లో ఇది రికార్డు. భారత్‌తో పాటు ప్రపంచమంతా ప్రస్తుతం ఓజీ పేరే వినిపిస్తోందన్నారు.