ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు
NEWS Sep 25,2025 12:48 pm
మెట్‌పల్లి: దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి తేనెతో అభిషేకం చేసి శాకాంబరి అలంకరణ చేశారు. జిల్లా అధ్యక్షులు మైలారపు లింబాద్రి లక్ష్మీ దంపతులు, పట్టణ అధ్యక్షులు రాంబాబు–సంతోషిని దంపతులు, మహాజన్ రామకృష్ణ–శిరీష దంపతులు, బండారి హరికృష్ణ–రాధికా దంపతులు, పాముపట్టి అమర్నాథ్ సంధ్యా దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.