కొంపల్లి వెంకట్ గౌడ్ ఇకలేరు
NEWS Sep 25,2025 05:39 am
ప్రముఖ రచయిత, తెలంగాణ వాది కొంపల్లి వెంకట్ గౌడ్ గుండెపోటుతో కన్నుమూశారు. ప్రొ. జయశంకర్ జీవితాన్ని “వొడువని ముచ్చట”గా, ఆర్. విద్యాసాగర్ రావు ఆలోచనలను “నీళ్ల ముచ్చట”గా పుస్తకాల రూపంలోకి తీసుకొచ్చారు. సర్వాయి పాపన్న చరిత్రను పరిశోధించి అక్షరబద్ధం చేశారు. పాపన్న అసలు చరిత్రను ఆధారాలతో సహా సేకరించే రాసే పనిలో ఉన్న సమయంలో ఈ విషాదం జరిగింది. తన రచనల ద్వారా బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా అభ్యున్నతి కలగాలన్నఆలోచన విధానంతో తన సాహిత్య జీవితాన్ని సాగించారు.