శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ అవుతున్న ఇండిగో (6E-816) విమానానికి పక్షి తగిలింది. అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని చాకచక్యంగా ల్యాండింగ్ చేయడంతో అందులో ప్రయాణిస్తున్న 162 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయట పడ్డారు.