శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
NEWS Sep 25,2025 07:03 am
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ దేవి చంద్ర ఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. రావణ వాహనంపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉత్సవమూర్తులను అధిరోహింప చేసే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో దంపతులు, వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు