కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన గడ్డం
NEWS Sep 24,2025 10:41 pm
కామారెడ్డి మండలంలోని ఇస్రోజివాడి గ్రామంలో ఇటీవల మరణించిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. మచ్చ సాయిలు, మద్దని రాజయ్య గారి తల్లి బాలవ్వ, దుబ్బాక పెద్ద గంగయ్య, పాల్వంచ ఎక్స్ ఉప సర్పంచ్ అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలుసుకుని ఆయన వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సహాయం అందజేశారు. తాజా మాజీ కౌన్సిలర్ పంపరి శ్రీనివాస్, పిడుగు సాయిబాబా, సలీం, మామిళ్ళ రమేష్, గ్రామ కాంగ్రెస్ నాయకులు గౌరు నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు.