సెప్టెంబర్ 26, 27న పిసిఓలకు శిక్షణ: కలెక్టర్
NEWS Sep 24,2025 10:39 pm
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ సెప్టెంబర్ 26, 27 తేదీల్లో నిర్వహించనున్నట్లు బుధవారం పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మండలాల వారీగా ధర్మారం, పెద్దపల్లి, ఎన్టీపీసీ, సుల్తానాబాద్, జేఎన్టీయూ మంథని కేంద్రాల్లో శిక్షణ జరుగనుంది. ఎంపీడీవోలు అధికారులకు ఆర్డర్లు అందజేసి, తక్షణమే శిక్షణకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.