మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఆయన ప్రైవేట్ జపం తప్పా జనం గురించి ఆలోచించరని ఎద్దేవా చేశారు. ఆయనకు ఆలోచన రావడమే ఈ రాష్ట్రానికి దురదృష్టకరం అన్నారు.. వైద్యరంగం ప్రైవేటీకరణ చేయడం పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారన్నారు. రూ.2లకే కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీఆర్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్ చేసిన వైఎస్ఆర్ ను మహా నాయకులని నేటికీ కొలుస్తున్నారని కానీ చంద్రబాబు ఏం చేశాడో చెప్పాలన్నారు.