లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ
NEWS Sep 24,2025 07:10 pm
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద లబ్ధిదారులకు రూ.5,10,000 విలువైన 21 CMRF చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీడీ కార్మికుల పెన్షన్, రైతు బంధు, రైతు భీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు ప్రజల మన్ననలు పొందాయని గుర్తుచేశారు. ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా, రాష్ట్రానికి దిశా, దారి చూపగల సామర్థ్యం ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.