మోడల్ స్కూల్ విద్యార్థులకు వృత్తి విద్యా శిక్షణ
NEWS Sep 24,2025 07:05 pm
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం మంచాల మోడల్ స్కూల్ విద్యార్థులకు వృత్తి విద్యా శిక్షణలో భాగంగా సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో స్కిల్ ట్రీ కన్సల్టెన్సీ ద్వారా ఒకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ ప్రత్యక్ష బోధన నిర్వహిస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు ఉత్తమ అభ్యాసాన్ని పొందే అవకాశం కలుగుతుందని పాఠశాల ప్రిన్సిపల్ సి.హెచ్. వెంకటలక్ష్మి తెలిపారు. దసరా సెలవుల సందర్భంగా ఈ నెల 21 నుండి అక్టోబర్ 2 వరకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. మోడల్ స్కూల్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఐటీ, ఐటీస్ విభాగాల విద్యార్థులకు చోడవరం, కొత్తకోట, చీడికాడ సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో ఎంపీడీవో, ఎంఈఓ, డిజిటల్ అసిస్టెంట్ పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమం కొనసాగనుంది.