స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్
NEWS Sep 24,2025 01:27 pm
అనంతగిరి మండలంలోని కొండిబ గ్రామంలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ బేబీ జాహ్నవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ అభియాన్ మహిళలకు ఆరోగ్య సంజీవినిలాంటిదని పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన ఈ శిబిరంలో 88 మంది మహిళలకు బిపి, షుగర్, క్యాన్సర్, టిబి ఆరోగ్య పరీక్షలు చేశారు. చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, కిశోర బాలికలకు హెమోగ్లోబిన్ స్థాయి పరీక్షలు చేశారు. అలాగే మహిళలకు రుతుక్రమ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహార ప్రాముఖ్యతపై ఆరోగ్య విద్య అందించి వైద్య చికిత్సలు చేశారు.