ఈనెల 26వ తేదీ లోపు బతుకమ్మకుంటలో బోటు షికారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం దీనిని నగర ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ హనుమంతరావుతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు కమిషనర్.