మంత్రి నాదెండ్ల మనోహర్ గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ బియ్యం వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది కేవలం 51 వేల మెట్రిక్ టన్నుల అక్రమ బియ్యం మాత్రమే స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. కానీ తాము వచ్చిన ఒక్క ఏడాదిలోనే 5 లక్షల మెట్రిక్ టన్నుల అక్రమ బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు.