అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలోని విజయరామరాజుపేట కాజ్‌వే వద్ద ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యమైంది. కాజ్‌వే నుండి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు, ఫైర్ సిబ్బంది కనుగొన్నారు. బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.