దేశంలోనే తొలిసారిగా AI Integrated Command Control Centre (ICCC) తిరుమలలో ఏర్పాటు చేశారు. ఎన్ఆరిల దాతృత్వంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 లో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక సదుపాయం భక్తుల దర్శన అనుభవాన్ని మరింత సౌకర్యవంతం చేయనుందని అన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఈనెల 25న సీఎం చంద్రబాబు దీనిని ప్రారంభిస్తారని తెలిపారు.