ఆత్మకూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్లు మంజూరు
NEWS Sep 24,2025 01:53 pm
వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికై కేటాయించడం జరిగింది. మున్సిపాలిటీల అభివృద్ధిపై మంత్రి వాకిటి శ్రీహరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని ఈ సందర్భంగా ఆత్మకూరు చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, భట్టి విక్రమార్క ఉత్తంకుమార్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ రహమతుల్లా, మండల ప్రెసిడెంట్ పరమేష్, ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు, సీనియర్ నాయకులు తులసి రాజ్, బంగారు భాస్కర్ పాల్గొన్నారు.