సీఎం చంద్రబాబుకు సీఐ లీగల్ నోటీస్
NEWS Sep 24,2025 12:48 pm
వివేకా హత్య కేసు సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య ఝలక్ ఇచ్చారు. సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు ఇచ్చారు. తన సమక్షంలోనే నిందితులు హత్యకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని గతంలో చంద్రబాబు దురుద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేశారంటూ ఈనెల 18న సీఎంకు నోటీసులు పంపారు. అసెంబ్లీలో బహిరంగ క్షమాపణ చెప్పాలని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.