ప్రతిపక్ష హోదా కోసం జగన్ పిటిషన్
NEWS Sep 24,2025 10:15 am
మాజీ సీఎం జగన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తమ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఏపీ కూటమి సర్కార్ కావాలని కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. కావాలని తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. తక్షణమే సర్కార్ ను ఆదేశించాలని కోరుతూ జగన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.