తిరుమలలో AI సేవలు ప్రారంభించనున్న సీఎం
NEWS Sep 24,2025 10:08 am
తిరుమలలో AI సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్-లోని 25వ కంపార్ట్‌మెంట్ వద్ద ఏర్పాటు చేశారు. దీన్ని సీఎం చంద్రబాబు రేపు ప్రారంభిస్తారు. అలిపిరి వద్ద అమర్చిన సీసీ కెమెరాలతో ఈ టెక్నాలజీ భక్తుల రద్దీని అంచనా వేసి అధికారులను అలర్ట్ చేస్తుంది. వసతి, భక్తుల భద్రత, ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం కట్టడికి ఇది ఉపయోగపడుతుంది.