స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే
NEWS Sep 24,2025 08:28 am
ములుగు జిల్లాలోని 23 గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మంగంపేట మండల పరిధిలోని 23 గ్రామాలను నిజాం ఆర్డర్ ఆధారంగా గిరిజన గ్రామాలుగా పరిగణించాలని గతంలో హైకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బాధితులు. ఈ పిటిషన్‌ను విచారించి, హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపి వేయడంతో పాటు ఆ 23 గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు.