ఆదివరాహస్వామి దేవస్థాన హుండీ లెక్కింపు
NEWS Sep 24,2025 10:04 am
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో గల శ్రీ ఆదివరాహ స్వామి దేవస్థాన హుండీలను ఈ నెల 25 సెప్టెంబర్ 2025, గురువారం ఉదయం 10 గంటలకు విప్పి లెక్కించనున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కాంతారెడ్డి ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఆసక్తి గల భక్తులు హుండీ లెక్కింపులో పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు.