శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.85 కోట్లు
NEWS Sep 24,2025 08:18 am
తిరుమల శ్రీవారిని 63 వేల 837 మంది భక్తులు దర్శించుకున్నారు. 20 వేల 904 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.85 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రస్తుతం డైరెక్టు లైన్ కొనసాగుతోందని తెలిపారు. ఇదిలా ఉండగా ఇవాల్టి నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.