అయిదేళ్ల పాలనలో జగన్ అసమర్థ నిర్ణయాల కారణంగా ఎక్కువగా నష్టపోయింది బీసీలేనని మంత్రి సవిత ఆరోపించారు. బీసీలను జగన్ ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాడన్నారు. బీసీల ద్రోహి జగన్ అని మంత్రి మండిపడ్డారు. బీసీల ఆత్మగౌరవం కోసం బీసీ రక్షణ యాక్ట్ రూపొందిస్తున్నామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం మేర రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీసీలంటేనే టీడీపీ అని, టీడీపీ అంటేనే బీసీలని అన్నారు.