హెచ్ ఎన్ డీఎస్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు
NEWS Sep 23,2025 08:16 pm
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలో మెట్టుపల్లి పట్టణం లో హనుమాన్ నగర్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కుంకుమ అర్చనలు ఘనంగా చేపట్టారు. ఈ రోజు అమ్మ వారికీ అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో 150 పైగా మహిళలు కుంకుమ అర్చనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.