హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆట పాటలతో అలరించారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం ఈ బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు రాష్ట్ర రైతు కమిషన్ సభ్యురాలు మరికంటి భవానీ రెడ్డి.