సబ్‌స్టేషన్ల లో ఫీడర్లకు బ్రేకర్లు : ఎస్ ఈ
NEWS Sep 23,2025 06:58 pm
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని యామపుర్, వేములకుర్తి గ్రామలలోని 33/11 కేవి సబ్‌స్టేషన్ల లో ఫీడర్లకు బ్రేకర్లను ప్రారంభించారు ఎన్పీడీసిఎల్ ఎస్ఇ సుదర్శనం . సబ్ స్టేషన్లలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా చేసేందుకే అదనపు బ్రేకర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎస్ఈ. దీని కారణంగా మరింత నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి డివిజన్ డిఈ మధుసూదన్, డిఈ ఎంఆర్ టి రవింధర్ ,ఎడి ఎస్పి యం అనిల్, ఇంచార్జి ఎడిఈ అమరెంధర్, ఎఇ సతిష్, తదితరులు పాల్గొన్నారు.