ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం
NEWS Sep 23,2025 07:00 pm
పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు శనిగరపు రమేష్ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దసరా పండగను ప్రతి పేద కుటుంబం ఘనంగా జరుపుకునే అవకాశం కలిగిందని తెలిపారు. అలాగే అనేక ఔషధాల ధరలు తగ్గడంతో జబ్బులతో బాధపడుతున్న వారికి ఊరట లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రేణుకాదేవి, పుల్లూరి పృద్విరాజ్, కుమారస్వామి, చారి, సత్యనారాయణ పాల్గొన్నారు.