బుచ్చయ్యపేటలో గంజాయి అక్రమ రవాణా పట్టివేత
NEWS Sep 23,2025 07:01 pm
బుచ్చయ్యపేట గ్రామ చెరుకు కాటా వద్ద పాడేరు ఏజెన్సీ నుండి కేరళకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను బుచ్చయ్యపేట పోలీసు అధికారులు మంగళవారం పట్టుకున్నారు. ఈ దాడిలో సుమారు 42 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గంజాయి కేసు నమోదు చేసి, రిమాండ్ నిమిత్తం చోడవరం కోర్టులో హాజరు పరిచారు.