ముసురుమిల్లీలో పౌష్టిక ఆహార మాస ఉత్సవాలు
NEWS Sep 23,2025 07:02 pm
రంపచోడవరం మండలం ముసురుమిల్లి పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో పౌష్టిక ఆహార మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోసు రమేష్ బాబు, ఎంపీటీసీ సభ్యులు వంశి కుంజం పాల్గొని గ్రామస్థులతో కలసి ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతపై విశదీకరించారు.అంగన్వాడీ కేంద్రంలో అందించే పౌష్టిక ఆహారం చిన్నారులు, గర్భిణీలు, పాలిచ్చే తల్లుల కోసం మాత్రమే. అదే విధంగా మన గ్రామంలో సహజంగా దొరికే ఆకుకూరలు, కూరగాయలను తరచూ ఆహారంలో చేర్చుకోవాలన్నారు,
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.