విజయరామరాజుపేటలో విద్యార్థి గల్లంతు
NEWS Sep 23,2025 04:33 pm
బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేటలో తాచేరు కాజ్వే వద్ద 8వ తరగతి విద్యార్థి ఆడారి రోహిత్ గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారం ప్రకారం, సరదాగా కాజ్వే వద్దకు వెళ్లిన రోహిత్ కాలి చెప్పు జారిపోవడంతో నదిలోకి పడిపోయిట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ప్రస్తుత వర్షం కారణంగా రక్షణ చర్యలకు అంతకంతకా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.