ఘనంగా కళాశాలలో ఆయుర్వేద దినోత్సవం
NEWS Sep 23,2025 04:14 pm
రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ఆయుర్వేద దినోత్సవాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. భాస్కర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యత, రోగనిరోధక శక్తిని పెంపొందించే విధానం, వనమూలికల లాభాలపై డాక్టర్ కె. రమేష్, డాక్టర్ జి. రమేష్, శ్రీ కె. పి. కృష్ణమూర్తి వివరణలు ఇచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.