సినీ పాత్రికేయ రంగం నుంచి అడ్ల రాంబాబు
జీవీఆర్ కల్చర్ ఫౌండేషన్ అవార్డుకు ఎంపిక
NEWS Sep 23,2025 02:48 pm
హైదరాబాద్: జీవిఆర్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి వేడుకలను బుధవారం శ్రీ త్యాగరాయ గానసభలో జరగనున్నాయి. పలు రంగాల్లోని ప్రముఖులకు, ప్రతిభావంతులకు అక్కినేని పురస్కారాలను ప్రదానం చేస్తారు. సినీ పాత్రికేయ రంగం నుంచి అడ్ల రాంబాబు (సినీవినోదం.కాం) ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అడ్ల రాంబాబుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. రేపు సాయంత్రం ఈ వేడుకల్లో రాంబాబును అక్కినేని పురస్కారంతో సత్కరిస్తారు.