సన్నబియ్యం పంపిణీకి ప్రత్యేక సంచులు
NEWS Sep 23,2025 01:35 pm
రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసే సన్నబియ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంచులను తయారు చేయించింది. “రేషన్ కార్డుపై అందరికీ సన్నబియ్యం.. ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం” అనే నినాదం ముద్రించిన ఈ సంచులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఫోటోలు ఉండనున్నాయి. ఇకపై బియ్యాన్ని ఈ ప్రత్యేక సంచుల్లోనే రేషన్ షాపులకు సరఫరా చేయనున్నారు. ఇప్పటివరకు వాడుతున్న గోనె సంచులు నిలిపివేస్తారు.