నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
NEWS Sep 23,2025 10:53 am
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల తాకిడికి వరద నీరు ఉధృతంగా వచ్చి చేరుతోంది నాగార్జున సాగర్ జలాశయానికి. దీంతో 26 క్రస్ట్ గేట్ల ఎత్తి కిందకు నీటిని వదిలారు. 10 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర, 16 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 3.83,170 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేశారు. ఇన్ ఫ్లో 3,15,483 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,34,176 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 586.70 అడుగులకు చేరుకుంది.