కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు. గత 24 ఏళ్లలో మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని చెప్పారు. ఈ దేశ చరిత్రలో ఇలా నిబద్దత కలిగిన ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇదంతా ఆయనకు దేశం పట్ల ఉన్న ప్రేమ ఏమిటో తెలుస్తుందన్నారు.