ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
NEWS Sep 23,2025 09:16 am
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇవాళ గాయత్రీ దేవి రూపంలో అమ్మ వారు దర్శనం ఇస్తారు. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రీ మంత్ర జపం చతుర్వేదం పారాయణ ఫలితాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం.