మధుసుధన్ గౌడ్‌కు ఏ1 బెస్ట్ మ్యారేజ్ బ్యూరో ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు
NEWS Sep 22,2025 11:31 pm
హైదరాబాద్: శ్రీలక్ష్మీ నరసింహ స్వామి మ్యారేజ్ బ్యూరో నిర్వహకులు సంధగల్ల మధు సుధన్ గౌడ్‌కు ఏ1 బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్స్ ద్వారా 'బెస్ట్ మ్యారేజ్ బ్యూరో ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు' లభించింది. మాదపూర్‌లోని అశ్రయ్ కన్వెన్షన్‌లో జరిగిన వేడుకలో డైరెక్టర్ అభినవ్ గౌడ్, యాక్టర్ సమీర్, విలన్ అజాద్, శ్రీకృష్ణ చాముండేశ్వరీ, శ్రీ చండి గురు జీ, నాగలక్ష్మి అవార్డును ప్రదానం చేశారు. మధుసుధన్ గౌడ్ సేవలు కుటుంబాలకు ముఖ్యమైన సహకారాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు.