ఐటీడీఏ పిఓ కలసిన ప్రజా ప్రతినిధులు
NEWS Sep 22,2025 08:55 pm
రంపచోడవరం ఐటిడిఏ నూతన ప్రాజెక్టు అధికారి స్మరన్ రాజ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఎంపీపీ బందం శ్రీదేవి, జడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, ఎంపీటీసీలు తుర్రం వెంకటేశ్వర్లు దొర,ఉ లవల లక్ష్మి, వంశీ కుంజం తదితరులు ప్రాజెక్టు అధికారిని పుష్ప గుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో గల సమస్యలను త్వరగా గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.