సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ ఎన్ఓసీ
NEWS Sep 22,2025 07:34 pm
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ ఇచ్చేందుకు ఛత్తీస్ గఢ్ సర్కార్ ఒప్పుకుందని తెలిపారు. ఈ మేరకు సీఎం విష్ణుదేవ్ తో చర్చించామన్నారు. నీట మునిగే భూభాగానికి పరిహారం ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ ఒప్పుకుందని ఈ విషయాన్ని తెలియ పర్చడంతో ఓకే చెప్పారన్నారు. 6.7 TMC సామర్ధ్యంతో ములుగు జిల్లాలో దీనిని చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీని కారణంగా నల్గొండ, వరంగల్ లో తాగునీటి సమస్య ఉండదన్నారు.