తిరుపతి వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి టీటీడీ పరకామణి వ్యవహారంపై స్పందించారు. అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలో కాదో తేలాలంటే ముందు కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని అన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు గురుమూర్తి. తప్పుడు ఆరోపణలు చేస్తూ తిరుమల ప్రతిష్టను ప్రభుత్వం దెబ్బ తీస్తోందంటూ ఆరోపించారు.