మధ్యవర్తిత్వం ఒక మంచి ఆలోచన
NEWS Sep 22,2025 07:36 pm
కోర్టుల్లో మధ్యవర్తిత్వ కేంద్రాలు ఏర్పాటు చేయడం ఒక మంచి ఆలోచన అని మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ రానవేణి సుజాత అన్నారు. స్థానిక మెట్ పల్లి కోర్టులో ఏర్పాటు కానున్న మీడియాషన్ సెంటర్ కోసం ఇటీవల శిక్షణ పూర్తిచేసుకున్న న్యాయవాదులు ఒజ్జెల శ్రీనివాస్, బక్కూరి రమేష్, తునికి వేణు గోపాల్, పసునూరి శ్రీనివాస్ లకు ఈ సందర్బంగా వారు శాలువా కప్పి సన్మానం చేసారు. కోర్టుల్లో పెరుగుతున్న పెండింగ్ కేసుల్ని పరిష్కరించడానికి మధ్యవర్తిత్వ కేంద్రాలు సత్పలితాలు ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేసారు.