హైదరాబాద్ ను ముంచెత్తిన వర్షం
NEWS Sep 22,2025 05:42 pm
ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ లో. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి పోయాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. మరికొన్ని గంటల పాటు వర్షం కురుస్తుందని, ఎవరూ అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమ ప్రయాణాలను కూడా మానుకోవాలని సూచించింది. మ్యాన్ హోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని , విద్యుత్ స్తంభాలు, చెట్ల వద్ద నిలిచి ఉండ కూడదని పేర్కొంది.