బంగారు మెట్ట కూడలిలో కల్వర్టు నిర్మించాలని వినతి
NEWS Sep 22,2025 05:44 pm
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం మర్రిచెట్టి జంక్షన్ వద్ద నీటిమునిగి ఉన్న ఇల్లును వడ్డాది టీడీపీ టౌన్ అధ్యక్షులు దొండా నరేష సుడిగాలి పర్యటన చేశారు. వారితో పాటు ఆర్ఎంబి జే ఈ సాయి శ్రీనివాస్ ,వీరిద్దరూ కలిసి పరిశీలించారు. ఈ మధ్యకాలంలో రోడ్డు ఎత్తు చేయడం వలన నీరు పోయే మార్గం లేదన్నారు. జేఈ తో కలసి ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. నీరు పోయేలా కల్వర్టు ఏర్పాటు చేయాలని జే ఈ ని కోరారు. ఉన్నత అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కారం చూపిస్తామని చెప్పారు.