26 న చక్కెర ఫ్యాక్టరీ కి వ్యవసాయ శాఖ సెక్రెటరీ
NEWS Sep 22,2025 05:47 pm
చక్కర ఫ్యాక్టరీలను పున ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత ఉందని రానున్న రోజుల్లో ఫ్యాక్టరీని పున ప్రారంభిస్తామని బకాయి ఉన్నటువంటి 170 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. చక్కెర ఫ్యాక్టరీల పరిశీలనకు ఈనెల 26న రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రెటరీ, ఉన్నతాధికారులు వస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.