ఆర్టీసీ అదనపు ఛార్జీల బాదుడు
NEWS Sep 21,2025 08:42 am
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్ షాక్ ఇచ్చింది. దసరా సెలవుల నేపథ్యంలో 50 శాతం ఛార్జీలను పెంచింది. పండుగ పూట అదనపు బస్సుల పేరుతో చార్జీలు భారం మోపింది. ఉప్పల్ నుండి తొర్రూరు సూపర్ లగ్జరీ టికెట్ ఛార్జీ ముందు రూ.300 ఉండగా ఇప్పుడు రూ.430 పెంచింది. మహబూబ్ నగర్ నుండి ఎంజీబీఎస్ సూపర్ లగ్జరీ టికెట్ ఛార్జీ ముందు రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.290 వసూలు చేస్తోంది. ఆర్టీసీ నిర్వాకంపై ప్రయాణీకులు లబోదిబోమంటున్నారు. ఎండీ, సర్కార్ పై మండిపడుతున్నారు.