కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకోవడం లేదని ప్రకటించారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ బి ఫారంపై పోటీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కూతురుకు ఎంపీ టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. తీరా బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడంతో అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.