ఏపీలో భారీ వర్షాలు
NEWS Sep 21,2025 08:20 am
ఏపీలోని ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు చెట్ల క్రింద నిలబడ వద్దని సూచించారు. ఈదురు గాలుల వీచేప్పుడు హోర్డింగ్స్ దగ్గర ఉండొద్దని పేర్కొన్నారు ఎండీ.