H1-B వీసా ఫీజు పెంపుపై వైట్‍హౌస్ క్లారిటీ
NEWS Sep 21,2025 08:14 am
అమెరికా ప్రభుత్వం హెచ్ 1 బి రుసుము పెంపుపై పూర్తిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుత వీసాలు, రెన్యువల్స్ కు పెంపు లేదని స్పష్టత ఇచ్చింది. కొత్త వీసాలకే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందని పేర్కొంది. 2025 లాటరీ వీసాలకు కూడా పాత ఫీజులే వర్తిస్తాయని తెలిపారు. లక్ష డాలర్ల ఫీజు జీవిత కాలానికి ఒకేసారే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది యుఎస్ సర్కార్.