ఆసక్తిగా ఎదురుచూసిన మంగ్లీ 2025 బతుకమ్మ పాట విడుదలైంది. "కొనగంటి కోటలో పుట్టలు.. పుట్ట మన్నులో పూసే తంగెళ్లు.." అంటూ విడుదలైన ఈ పాట సంప్రదాయ పండుగకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ పాటకి సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా, హరీష్ తల్ల ట్యూన్ చేశారు. కమల్ ఎస్లావత్, హరీష్ తల్ల సంయుక్తంగా రాసిన సాహిత్యం బతుకమ్మ పండుగ స్ఫూర్తిని అద్భుతంగా ఆవిష్కరించింది. తిరుపతి సినిమాటోగ్రఫీ మంగ్లీ గాత్రాన్ని, ప్రదర్శనను మరింత గొప్పగా చూపించింది.