పాడేరు ఐటిడిఏ పిఓ శ్రీ పూజ అరకు పర్యటన
NEWS Sep 20,2025 11:09 pm
పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి (పిఓ) శ్రీ పూజ అరకు వెళ్లి పెదలబుడు పంచాయతీ పరిధిలోని గిరి గ్రామదర్శినిని సందర్శించారు. అక్కడి గిరిజనులు ఆమెను తమ సాంప్రదాయం ప్రకారం అలంకరించి ఆతిథ్యం ఇచ్చారు. గ్రామదర్శినిలో గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే అంశాలను పరిశీలించిన పిఓ, గిరిజన యువతలా అలంకరించుకొని తిరగలి తిప్పడం, వ్యవసాయ పనులు చేయడం వంటి కార్యక్రమాల్లో పాల్గొని సంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన సంప్రదాయం ఒక ప్రత్యేకత అని ఆమె కొనియాడారు. ఈ సందర్బంగా పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు పిఓకు సమస్యలను వివరించారు. గ్రామదర్శినిలో మరుగుదొడ్లు, ప్రహరీ గోడ నిర్మాణం వంటి వసతులు కల్పించాలని పిఓకు వినతిపత్రం సమర్పించారు.